రేపటి బీసీల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేద్దాం
బీసీ సమాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగ పరిమిల
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): బీసీలు ఐక్యంగా ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమని బీసీ సమాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగ పరిమిల పిలుపునిచ్చారు. బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ... బీసీ కులాలు ఏక తాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం మెదక్ లోని మాయ గార్డెన్ లో నిర్వహిస్తున్న బీసీల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు డా.కె. లక్ష్మణ్ రానున్నట్లు ఆమె తెలిపారు. బీసీల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు గొల్ల పవన్ కుమార్, మాయ శంకర్, బీరప్ప, బండ నరేందర్, ప్రసాద్ యాదవ్, పూసల శ్రీనివాస్, చెన్న రాంచంద్రం, నగరం నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.
