తెలంగాణ ప్రభ, (ఎల్లారెడ్డి పేట): భక్తులు ధర్మప్రవర్తన భగవచ్చింతన కలిగి ఉండాలని జగిత్యాల కు చెందిన కౌశిక శ్రీ మాన్ నంబి వేణుగోపాలాచార్య అన్నారు.
బ్రహ్మిభూతులైన భక్త శ్రీ శ్రీ సరస్వతీ గోవిందా రాజులు స్థాపించిన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సత్సంగ సదనం లో 63 వ వార్షికోత్సవం సందర్భంగా కార్తీక శుక్ల ఏకాదశి గత
15 వ తేదీ బుధవారం నుంచి ప్రారంభించి 23 వ తేదీ గురువారం వరకు పెద్దలు కర్మ భక్తి జ్ఞానము గురించి శ్రీ మద్భాగవతసప్తాహాన్ని ఆద్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
ఎల్లారెడ్డిపేట సత్సంగ సదనం అధ్యక్షులు బ్రహ్మచారి లక్ష్మారెడ్డి ప్రభాతభేరి, గీతా పారాయణం సూర్య నమస్కారములు ఆద్యాత్మిక గురించి భోదించారు.శ్రీ సరస్వతీ గోవిందా రాజులు శ్రీ రామ నామంతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సత్సంగ సదనం స్థాపించి లిఖిత శ్రీ రామకోటి స్థూపాన్ని నిర్మించి వేలాది మంది భక్తులను తయారు చేసిన మహాపురుషుడని కొనియాడారు.శ్రీ నంబి వేణుగోపాలాచార్య సత్సంగం భక్తుల కన్నులకు కట్టినట్లు సాగింది.
గోవిందా జై జై ,గోపాల జై జై, ,శ్రీ రామ జై జై ,
శ్రీ కృష్ణ జై జై శ్రీనివాస జై జై, వెంకటేశ జై జై అనే నామస్మరణతో సత్సంగ సదనం భక్తులతో మారుమోగింది.శ్రీ కృష్ణునుని పరమత్మ చరిత్ర దశమ స్కంధం చాలా గొప్పది కీర్తించారు.
ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల కు చెందిన భక్తులు పాల్గొన్నారు వారికి సత్సంగ సదనం ఆద్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.
.