తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); బిఆర్ఎస్ తోని అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఎంపీపీ పడిగల మానస అన్నారు. మంగళవారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని 189వ బూత్ రాంనగర్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీపీ మానస స్థానిక ప్రజాప్రతినిధులు,కార్యకర్తలతో కలిసి గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మానస మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని, తెలంగాణలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవని, సంక్షేమ పథకాలు అలాగే కొనసాగాలంటే మరోమారు బిఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మైనార్టీ నాయకులు, యూత్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
