తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); తంగళ్ళపల్లి మండలం మండెపల్లి గ్రామ రజక సంఘ నాయకులు సభ్యులు సమావేశం నిర్వహించి ఈనెల నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ ని భారీ మెజార్టీతో గెలిపించడానికి ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రజక సంఘం సమితి చైర్మన్ అక్క రాజు శ్రీనివాస్, జిల్లా రజక సంఘం అధ్యక్షులు దుబ్బాక రమేష్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి పోయాయి కాని రజకులను ఇంతవరకు గుర్తించలేరు అలాంటిది బి ఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించి మాడ్రన్ ధోబి ఘాట్లు రుణ సౌకర్యాలు, 250 యూనిట్ల వరకు ఉచిత కరెంటు వంటివి కల్పించిందన్నారు.గతంలో హైదరాబాదులో మీటింగ్ పెట్టుకుందామంటే ఆఫీసు లేని రోజులని ముఖ్యమంత్రి కేసీఆర్ రజకుల కొరకు రెండెకరాల స్థలాన్ని కేటాయించారన్నారు.చాకలి ఐలమ్మ వంటి పోరాట యోధురాలిని గుర్తించి ప్రభుత్వం అధికారికంగా జయంతి వర్ధంతి ఉత్సవాలను జరుపుతుందని తెలిపారు.బి ఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని కారు గుర్తుకు ఓటేసి కేటీఆర్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గనప శివ జ్యోతి, ప్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్,బి ఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గనప మదన్, గ్రామ శాఖ అధ్యక్షులు నక్క రవి,రజక సంఘం గ్రామ అధ్యక్షులు దుబ్బాక వెంకటేశం, నగునూరి పరుశరాములు, రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
