జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ రాజర్షి షా
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): మెదక్ జిల్లాలోని రెండు నియోజకవర్గాలలో (మెదక్, నర్సాపూర్) నవంబర్ 30న జరిగే ఎన్నికలలో 100% పోలింగ్ లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా స్వీప్ అధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలను చేపడుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.
అందులో భాగంగా మంగళవారం “ వాక్ ఫర్ ఓటు” (WALK FOR VOTE) అనే స్లోగన్ తో రాందాస్ చౌరస్తా నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు సాగింది. ఇందులో సుమారు 2000 మంది యువ ఓటర్లు,
భవిష్యత్తు ఓటర్లు, జిల్లా కేంద్రంలోని వివిధ కళాశాల నుండి ఉత్సాహంగా పాల్గొన్నారు.
ముగింపు సభలో యువ ఓటర్లను ఉద్దేశించి జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి మాట్లాడుతూ నవంబర్ 30న మీ యొక్క పోలింగ్ కేంద్రంలో ముందుగ పండుగ వాతావరణంలో మీరే ఓటు హక్కు వినియోగించు కోవాలన్నారు.
ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే C-Vigil యాప్ / 1950 ద్వారా సమాచారం ఇవ్వాలన్నారు. విద్యార్థులందరూ మా యొక్క పిలుపు మేరకు 18 సంవత్సరాలు నిండిన అందరు ఓటరుగా నమోదు చేసుకున్న యువతరం ఖచ్చితంగా ఓటును వినియోగించుకోవాలని అన్నారు. తప్పని సరిగా కుటుంబ సభ్యులు అందరు ఓటింగ్ లో పాల్గొనెలా చూడాలని హామీ ఇవ్వాలన్నారు. అనంతరం యువ ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ. మహేందర్, డీఈవో రాధాకృష్ణ, డి ఐ ఈ ఓ సత్యనారాయణ, మెదక్ ఆర్ ఓ రాజేశ్వర్ , స్వీప్ నోడల్ అధికారి/ DWO బ్రహ్మాజీ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, DYSO, నాగరాజు, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్ లు , అధ్యాపకులు మరియు కళాజాత బృందాలు పాల్గొన్నారు.
.