వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి
ఆస్తి అమ్ముతానoటున్న డిసిఎంఎస్ చైర్మన్
బకాయి ఇప్పించకుండా ప్రగల్బాలు ఎందుకు?
23న జహీరాబాద్ బంద్ యథాతథం
ట్రైడెంట్ ఎదుట మరోసారి రైతుల సమావేశం
బిజెపి, కాంగ్రెస్, బిఎస్పి, విఆర్పి అభ్యర్థుల మద్దతు, ముఖ్యమంత్రి పైనే ఆశలు
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో):సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ చెరుకు రైతులు మంగళవారం నాడు మరోసారి ట్రైడెంట్ ఫ్యాక్టరీ ఎదుట సమావేశమయ్యారు. ఈనెల 23న ముఖ్యమంత్రి కెసిఆర్ జహీరాబాద్ పర్యటన సందర్భంగా ఉద్యమ కార్యచరణపై చర్చించారు. అయితే మధ్యాహ్నం కొన్ని నాటకీయ పరిణామాలు జరిగాయి. రైతులు తమతో చర్చకు రావాలని బిఆర్ఎస్ నాయకుల ప్రతిపాదనను రోజు బుచ్చి చర్చలకు తమ వద్దకే రావాలని రైతులు కోరారు. నాటకీయంగా రైతుల దగ్గరికి రాకుండా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు, వింత వాదనలు, మూర్ఖపు ఆలోచనలు అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయని సామాజికవేత్త ఢిల్లీ వసంత్ ఆరోపించారు.
బకాయిల చెల్లింపు, ఫ్యాక్టరీ ప్రారంభం,గిట్టుబాటు ధర, ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ, కార్మికుల సమస్యలపై ఏమి మాట్లాడకుండా విషయాలను పక్కదోవ పట్టిస్తూ రైతులను మూర్ఖులుగా సంబోధించిన స్థానిక ఎమ్మెల్యే మాణిక్యరావు మాటలను రైతు నాయకులు ఖండిస్తూ బేషరతుగా క్షమాపణ కోరారు. అదేవిధంగా ప్రభుత్వ అధీనంలో ఉన్నది కాబట్టి కర్మాగార పరిధిలోని స్థిరాస్తులను అమ్ముతాం అంటూ ఎమ్మెల్యే చేసిన ప్రతిపాదన మోసపూరిత కుట్రగా రైతులు వర్ణించారు. అదేవిధంగా డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్ మాట్లాడుతూ మూడు నెలల లోపు కర్మాగార బకాయిలు చెల్లించని పక్షాన తన ఆస్తులు అమ్ముతాను అంటూ చేసిన వింత వాదన ఎవరి ప్రయోజనాలు కాపాడడం కోసం అంటూ రైతులు భగ్గుమన్నారు. ఇదంతా కర్మాగార ఆస్తులను అమ్మి వేసి కుట్రగా రైతులు . ఎట్టి పరిస్థితిలో 23న తలపెట్టిన జహీరాబాద్ బంద్ జరిపి తీరుతాం అంటూ రైతులు పేర్కొన్నారు. దీనికి స్థానిక వివిధ పార్టీల మద్దతు ప్రకటించారు. విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థి నవోదయ సిద్దు, బిజెపి అభ్యర్థి రామచందర్ రాజ నరసింహ, కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్, bsp నాయకులు జంగం గోపి అనుచరులు జైరాబాద్ బందుకు తమ వంతుగా సహకరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో పలు సంఘాల నాయకులు, రైతు నాయకులు, వివిధ పార్టీల శ్రేణులు, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు సంఘీభావం తెలిపారు.
.