తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); బీఆర్ఎస్ తోనే పేదలకు సంక్షేమం అందుతుందని ఎంపీపీ పడిగల మానస పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఇందిరానగర్ లో ఎంపీపీ మానస, ప్రజా ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు కలిసి ఇంటింటికి విస్తృత ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కారు గుర్తుకే ఓటేసి కేటీఆర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ఎట్లుండేదో... ఈనాటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎట్లుందో ప్రజలు గమనించి సరైన నాయకున్ని ఎన్నుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు సక్రమంగా అందాలన్నా, మన బతుకులు మారాలన్న మరోసారి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మైనార్టీ మండల నాయకులు, బీఆర్ఎస్ యూత్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
