తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట): మానకొండూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కు ఇల్లంతకుంట మండల తెలుగుదేశం పార్టీ తరఫున మద్దతు తెలుపుతూ రానున్న అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కవంపల్లి సత్యనారాయణ ను గెలిపించుకోవడానికి తమ సంపూర్ణ మద్దతు తెలుపుతూ చేతి గుర్తుకు ఓటు వేసి వారి విజయానికి కృషి చేస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చిట్టి ఆనంద రెడ్డి కరీంనగర్ పార్లమెంటు ఉపాధ్యక్షుడు అన్నాడి నరేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లోజి, మండల ప్రధాన కార్యదర్శి అనుపురం చిరంజీవి, మండల నాయకులు దొమ్మాటి లక్ష్మణ్, ఎండి ఇస్మాయిల్,రాష్ట్ర అధికార ప్రతినిధి దామర సత్యం తదితరులు పాల్గొన్నారు.
