తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): ప్రజలలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించి, శాంతియుత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించడానికి కేంద్ర సాయుధ బలగాలతో సంగారెడ్డి జిల్లా జోగిపేట సర్కిల్ లో గల జోగిపేట, పుల్కల్, వట్ పల్లి పోలీసు స్టేషన్ల పరిధిలో గల సమస్యాత్మక పోలింగ్ లొకేషన్స్ లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్, సంగారెడ్డి డియస్పి రమేష్ కుమార్, ఇన్స్పెక్టర్స్ నాగరాజు, విమెన్ పి. యస్. ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కమాండర్ రాహుల్ రామరావ్ జడే, ఆర్.ఐ. షేక్ అహ్మద్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది, యస్.ఐ.లు అరుణ్ కుమార్, రాజశేఖర్, కోటేశ్వర్ రావ్, సర్కిల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
