కాంగ్రెస్ లో కి భారీ చేరికలు

కాంగ్రెస్ గూటికి చేరుకున్న కందికట్కూరు మాజీ ఎంపీటీసీ యస తిరుపతి, వల్లంపట్ల మాజీ ఎంపిటిసి కీసరి కనకయ్య ,సుధాకర్, శ్రీనివాస్ 

తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట): మండలంలో ని కందికట్కూరు మాజీ ఎంపిటిసి యాస తిరుపతి, వల్లంపట్ల మాజీ ఎంపిటిసి కీసరి కనకయ్య   ,సుధాకర్, శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ మానకొండూర్ అభ్యర్థి డాక్టర్  కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీ లొకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ  బిఆర్ఎస్ దొంగ హామీలను,మాయమాటలు నమ్మే పరిస్థితి లో ప్రజలు లేరని,మానకొండూర్ నియోజకవర్గ అభివృద్ధి,ప్రజల సంక్షేమం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో  ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి, మండల  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాఘవరెడ్డి, మాజీ ఎంపీపీ గుడిసే ఐలయ్య యాదవ్, ఎంపీటీసీ కిషోర్, మానకొండూరు నియోజకవర్గ అధికారం ప్రతినిధి పసుల వెంకట్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు,గ్రామ శాఖ అధ్యక్షులు, ఫాక్స్ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,మండల కాంగ్రెస్ నాయకులు, కుల సంఘాల నాయకులు,కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

.