మోసగారులను నమ్మితే నట్టేట మునిగినట్టే!

ప్రజల సొమ్ము దోచుకున్నోళ్లకు ఓటేద్దామా?

నన్ను గెలిపిస్తే అభివృద్ధి ఏమిటో చూపిస్తా 

మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ):  ప్రజల చేత ఎన్నుకోబడి పదేళ్లపాటు ప్రజల సొమ్మును దోపిడీ చేసిన దగాకుర్లకు మళ్లీ ఓటు వేసి మోసపోవద్దని  మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు.

ఆదివారం చిన్న శంకరంపేట మండలంలోని టీ. మాందాపూర్, మాందాపూర్ తండా, కామారం తండా కామారం భాగిర్తిపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ గ్రామాలలో మహిళలు బోనాలు పోతరాజుల విన్యాసాలు డప్పు వైద్యాల మధ్య రోహిత్ రావుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 

మోసకారుల మాటలు నమ్మి

మోసపోవద్దని పదేళ్ల పాలనలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమిటో చూసి ఓటు వేయాలని సూచించారు.  తమకు పదవులు అవసరం లేదని ప్రజాసేవనే లక్ష్యంగా ఎంచుకొని బతికున్నంత వరకు ప్రజా సేవ చేస్తానని తెలిపారు. తమపై బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని, ఇందిరమ్మ రాజ్యం వస్తే, ఆ అంశాలు సోనియాగాంధీ ప్రజలకు హామీ ఇచ్చిందని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వాటిని అమలు చేస్తామని పేర్కొన్నారు.

పదేళ్లు పాలించిన మెదక్ నియోజకవర్గాన్ని దోచుకున్నది దాచుకున్నది సరిపోలేదా అన్నారు.

కమీషన్ల సంపాదనతో కోట్లు కొల్లగొట్టాలని, పోరాడి తెచ్చుకున్న తెలంగాణను కమీషన్ల తెలంగాణ చేశారని, నాణ్యతలేని ప్రాజెక్టులు నిర్మించారని విమర్శించారు.

మాయమాటలకు మోసపోవద్దని, యువకునిగా తనను ఆదరించి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. దోచుకోవడం, దాచుకోవడం వాళ్ల నైజం అన్నారు. బీసీ బంధ్, దళిత బంధ్ ఎంతమందికి ఇచ్చారో తెలపాలన్నారు.

ఇందిరమ్మ రాజ్యం రావాలంటే చేయి గుర్తుకు ఓటేసి గెలిపిస్తే భూమిలేని పేదలకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని, ప్రతి ఇంటికి కరెంట్ 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామని, మహిళా ఖాతాల్లోకి రూ. 2000 వేస్తామని గ్యాస్ సిలిండర్ రూ.500 ఇస్తామని రైతుబంధ్ కింద కౌలుదారులకు ఏడాదికి రూ.15వేలు, ఉపాధి కూలీలకు రూ. 12 వేల చొప్పున అందించనున్నట్లు  తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజు రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగానరేందర్, డీసీసీ కార్యదర్శి శ్రీమన్ రెడ్డి, రామ్ రెడ్డి, మాజీ సర్పంచ్ హేమలత సుధాకర్, హలవత్ మోహన్ నాయక్, ఉప సర్పంచ్ జీవన్, రవి చంద్, సాన సత్యనారాయణ, మైనంపల్లి రంగారావుతో

పాటు తదితరులు పాల్గొన్నారు.

.