పోచమ్మ రాళ్లు చెక్పోస్ట్ ను సందర్శించిన వేయ పరిశీలకుడు సంజయ్ కుమార్

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): సాధారణ ఎన్నికల్లో  భాగంగా  మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్  మండలం,   పోచంరాల్ వద్ద గల  పోలీస్ చెక్ పోస్ట్ ను ఆదివారం  జిల్లా వ్యయ పరిశీలకుడు  సంజయ్ కుమార్ IRS  పరిశీలించారు . సాయుధ దళాలకు , తనిఖీ బృందాలకు  పలు సూచనలు చేశారు. చెక్ పోస్ట్  వద్ద గల సి సి కెమెరాలు , 24 గంటలు పనిచేయాలని , ప్రతి వాహనాన్ని  ఖచ్చితంగా  తనిఖీ చేయాలని ఆదేశించారు .

అనంతరం హవేలీ ఘనపూర్  మండలంలోని   ఔరంగాబాద్ తండా , కొచ్చెర్వు తండా , లింగాపూర్ తండా ,  పాటిగడ్డ తండా ల్లో  జిల్లా వ్యయ పరిశీలకుడు  సంజయ్ కుమార్ IRS పర్యటించారు . ఆయన  గ్రామ  ప్రజలతో  మాట్లాడుతూ, ఓటుహక్కు వున్నా,  ప్రతి ఒక్కరు  తప్పనిసరిగా తమ ఓటును  వినియోక్గించుకోవాలని అన్నారు. యువకులు నూతన ఉత్సాహంతో  ఓటు వేయాలని  అన్నారు.

జిల్లాలో  బి ఎల్ ఓ  లు  ఓటరు సమాచార స్లిప్లు  పంపిణి   చేస్తున్నారని,  ఓటరు సమాచార  స్లిప్  తో   పాటు  ఓటరు గైడ్ , C- విజిల్  కరపత్రాన్ని అందిస్తున్నారని , ప్రజలందరూ  ఎన్నికలనియమావళి  తెలుసుకోవాలని అన్నారు . C - విజిల్  ఆప్ , టోల్ ఫ్రీ నెంబర్ 1950 ముఖ్యఉద్దేశాన్ని  ప్రజలకు వివరంచారు .  ఎన్నికల్లో   ప్రలోభాలకు  గురిచేస్తే , C -విజిల్  ఆప్  ద్వారా  , పిర్యాదు చేయవచ్చని , పిర్యాదు దారుల  వివరాలు గోప్యంగా ఉంచబడతాయని  తెలిపారు . 

ఈ కార్యక్రమంలో పోలీస్  అధికారులు,  ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

.