138 కేసులకు సంబంధించి రూ. 3,18,21,238 /- విడుదల
జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 152 కేసులలో రూ.4,69,20,238/- రూపాయలు సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో ఇప్పటివరకు
50 వేల రూపాయలు మించి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న 152 మంది వ్యక్తుల నుండి రూ.4,69,20,238/- లు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. సరియైన ఆధారాలు సమర్పించిన 138 మందికి 3,18,21,238/-
రూపాయల నగదు విడుదల చేసినట్లు తెలిపారు.
మిగిలిన 14 కేసులలో మూడు కేసులను ఆదాయ పన్ను శాఖకు రెఫెర్ చేసినట్టు తెలిపారు. మిగిలిన 11 కేసులకు సంబంధించిన వారు సరి అయిన ఆధారాలను జిల్లా గ్రీవెన్స్ కమిటీలో సమర్పించి డబ్బును విడుదల చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో సూచించారు.
ఏవేని సందేహాల నివృత్తికి ప్రజలు జిల్లా గ్రీవెన్స్ కమిటీ సెల్ లో సంప్రదించ వచ్చని సూచించారు.
.