అక్రమార్కుల ఆగడాలకు స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసుల చెక్

అక్రమంగా తరలిస్తున్న 8000 ల లీటర్ల డీజిల్ ట్యాంకర్ పట్టివేత. 

అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న 15 గ్యాస్ సిలిండర్స్ సీజ్. 

అక్రమ మధ్యం అమ్ముతున్న 2-బెల్ట్ షాప్ లపై దాడి 18 లీటర్ ల మధ్యం సీజ్...

జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ):  సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న వివిధ రకాల అసాంఘిక చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు గాను, జిల్లా ఎస్పీ  ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ఫోర్స్ టీమ్స్ జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించడం జరుగుతుంది. ఈ దాడులలో భాగంగా.. 

ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ... సంగారెడ్డి జిల్లాకు చెందిన రాధాకృష్ణ అనే వ్యక్తి, తన డ్రైవర్ ప్రశాంత్  సహకారంతో డీజిల్ ట్యాంకర్ తెలంగాణ  15 UA 7947 నంబర్ గల దానిలో 8000 వేల లీటర్ల డీజిల్ ను పొరుగు రాష్ట్రమైన కర్ణాటక, కుంచారం నుండి తక్కువ ధరకు డీజిల్ కొనుగోలు చేసి, సంగారెడ్డి జిల్లా యం.యన్.ఆర్. చౌరస్తాలో గల టొరెంట్ పెట్రోల్ పంప్ నందు అమ్మడానికి గాను తరలిస్తుండగా మునిపల్లి టోల్ ప్లాజా వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా డ్రైవర్ తన యొక్క  రాధాకృష్ణ ఆదేశాల మేరకు కర్ణాటక నుండి తరలిస్తున్నట్టు వివరించారు. ట్యాంకర్, డ్రైవరు ను అదుపులోకి తీసుకొని తదుపరి విచారణకై మునిపల్లి పోలీసులకు అప్పగించారు         

పెద్దాపూర్ గ్రామానికి చెందిన దానయ్యల నితిన్ గౌడ్  ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా తన షాప్ నందు అక్రమంగా మద్యాన్ని అమ్ముతుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి రాయల్ స్టాగ్-4 (180ml), బ్లెండెడ్ స్ప్రైడ్ -2 (180ml), ఆఫీసర్ చాయిస్ -12 (180ml), ఐ.బి.-5 (90ml), యం.సి.-4 (90ml), ఆఫీసర్ చాయిస్-6  (90ml), గుడ్ డై-8 (90ml).  అదే గ్రామానికి చెందిన దాసరి దుర్గయ్య ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా తన షాప్ లో అక్రమంగా మద్యాన్ని అమ్ముతుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి ఆఫీసర్ చాయిస్-11 (180ml), గుడ్ డై -10 (180ml), ఆఫీసర్ చాయిస్-3 (90ml), మొత్తం 9.180 లీటర్ల మద్యాన్ని  స్వాధీనపరుచుకొని, నిందితులతో సహ స్వాధీనపరుచుకున్న సొత్తును తదుపరి విచారణ నిమిత్తం సదాశివపేట పోలీసు స్టేషన్ కు  తరలించనైనది. 

న్యాల్కల్ మండలం, బస్వాపూర్ గ్రామానికి చెందిన ఏలంగి రఘుపతి తండ్రి శివ శరణప్ప ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా తన షాప్ నందు అక్రమంగా మద్యాన్ని అమ్ముతుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి నాక్అవుట్ స్ట్రాంగ్ -9 (650ml), ఐ.బి.-6 (180ml), ఆఫీసర్ చాయిస్ -7 (180ml), డౌన్ టోన్-3 (180ml),  రాయల్ స్టాగ్-1 (180ml) మొత్తం 8.910  లీటర్ల మద్యాన్ని  స్వాధీనపరుచుకొని, నిందితులనితో  సహ స్వాధీనపరుచుకున్న సొత్తును తదుపరి విచారణ నిమిత్తం హద్నూర్ పోలీసు స్టేషన్ కు  తరలించారు 

లక్ష్మీ నగర్ కాలనీ, బొల్లారం సమగారెడ్డి జిల్లాకు చెందిన బిట్టు కుమార్ తన యొక్క కిరాణం షాప్ నందు అక్రమంగా గ్యాస్ రిఫిల్లింగ్ చేస్తున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించి హెచ్.పి. గ్యాస్ ఫుల్ 15.8kg గలవి-07, ఇండియన్ గ్యాస్ కమర్షియల్ 9kg గలవది-01, చిన్న గ్యాస్ 4kg గలవి-07, మొత్తం 15 సిలిండర్స్, వేయింగ్ మిషన్-01, రీఫిలింగ్ పైప్స్-02, స్వాధీనపరుచుకొని, నిందితునితో సహ స్వాధీనపరుచుకున్న సొత్తును తదుపరి విచారణ నిమిత్తం బొల్లారం పోలీసు స్టేషన్ కు  తరలించారు

.