బిఆర్ఎస్ కు మద్దతు పలకనున్న సిపిఎం
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో) : సంగారెడ్డి జిల్లాలో సిపిఎం పార్టీ అభ్యర్థులు నిలబడనిచోట బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు తెలిపేందుకు సిపిఎం పార్టీ నేతలు సిద్ధమయ్యారు. ఈ మేరకు మంత్రి హరీష్ రావు చేసిన మంతనాలు సఫలం అయ్యాయి.
గురువారం సంగారెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చింతా ప్రభాకర్ తో కలిసి సంగారెడ్డి పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య నేతలతో మంత్రి హరీష్ రావు సమావేశం నిర్వహించారు.
సంగారెడ్డి జిల్లాలో సిపిఎం పార్టీ పోటీ చేయని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలిపాలని మంత్రి హరీష్ రావు కోరారు.
దీంతో సిపిఎం నాయకులు సానుకూలంగా స్పందించారు.
సీపీఎం పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చుక్క రాములు, మల్లేశం, గొల్లపల్లి జయరాజ్, మాణిక్యం , సిపిఎం పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
.