వంద శాతం ఓటింగ్ లక్ష్యం
IDOCలో సెల్ఫీ పాయింట్
మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు రాజర్షి షా
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): సాధారణ ఎన్నికలో బాగంగా మెదక్ కలెక్టర్ కార్యాలయంలో 100 శాతం పోలింగ్ లక్ష్యంగా యువ ఓటర్లను ఆకర్షించడానికి సెల్ఫీ పాయింట్ లను ఎన్నికల సాధారణ పరిశీలకుడు పృధ్వీరాజ్ బీపీ ఐఏఎస్, వ్యయ పరిశీలకుడు సంజయ్ కుమార్ IRS , పోలిస్ పరిశీలకుడు సంతోష్ కుమార్ తుకారాం DIG , జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు రాజర్షి షా, జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని లతో అవిష్కరించారు. ఎన్నికలకు సంబంధించిన ఓటర్ నమోదు, ఎథిక్ ఓటింగ్, C -విజిల్, టోల్ ఫ్రీ నెం1950 వంటి వాటిపై రంగోలి పోటీలు నిర్వహణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోటీలో వివిధ శాఖలకు చెందిన 50 టీమ్ లు పాల్గొన్నాయి.
అనంతరం ఈ కార్యక్రమంలో కలెక్టరు రాజర్షి షా మాట్లాడుతూ సాధారణ ఎన్నికలలో భాగంగా
స్వీప్ ఆధ్వర్యంలో జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో 100 శాతం ఓటింగ్ లక్ష్యంగా ప్రచారం చేస్తుందని తెలిపారు. "నేను కచ్చితంగా ఓటు వేస్తాను "అనే నినాదంతో ప్రజలు అందరూ ఓటింగ్ లో భాగస్వామ్యం కావాలని పిలపునిచ్చారు.
రంగోలిలో మూడింటికి ఉత్తమమైనదిగా ఎంపిక చేశారు. మెదక్ నగర పంచాయతీ మొదటి బహుమతి, రెండవ, మూడవ బహుమతులు DCPU, చైల్డ్ లైన్ మెదక్ వారికీ అందాయని తెలిపారు.
అనంతరం యంగ్ ఓటర్లు, మహిళలు , ఉద్యోగులచే ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ ప్రతిజ్ఞలో ఎన్నికల సాధారణ పరిశీలకులు పృధ్వీరాజ్ బీపీ, వ్యయ పరిశీలకులు సంజయ్ కుమార్, పోలిస్ పరిశీలకులు సంతోష్ కుమార్ తుకారాం, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు రాజర్షి షా, జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, డిప్యూటీ ఎన్నిక అధికారి మరియు అదనపు కలెక్టర్ లు వెంకటేశ్వర్లు, DRO పద్మ శ్రీ, జిల్లా సంక్షేమ అధికారి బ్రాహ్మ జి ,జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, SC ED విజయ లక్ష్మి, DCO కరుణ,AO యునస్. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు, పాల్గొన్నారు.
.