ఓటమి భయంతో మాట్లాడుతున్న బిఆర్ఎస్ నేతలు
మెదక్ కాంగ్రెస్ నేతల ధ్వజం
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): మెదక్ బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ ను దిష్టిబొమ్మ అనడం
అవివేకమని కాంగ్రెస్ నాయకులు సురేందర్ గౌడ్,జీవన్ రావు లు మండిపడ్డారు.గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ చేతిలో పద్మా దేవేందర్ రెడ్డి ఓటమి పాలౌతుందని అన్నారు. ప్రజా ఆశీర్వద సభలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ ఉత్తవేనని ఆవేదన వ్యక్తం చేశారు.పద్మా దేవేందర్ రెడ్డి గెలిపిస్తే అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. తెలంగాణ ను సిద్దిపేట్ నాయకులు పాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ సినిమా డైలాగులు మానుకోవాలని హితవు పలికారు.మెదక్ సభలో బీఆర్ ఎస్ నాయకుల హంగు ఆర్భాటం విఫలమైందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ప్రతి ఎన్నికల సమయంలో హామిలిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.10 సంవత్సరాలలో పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ లో ఎం అభివృద్ధి చేసిందని ప్రజలు ఓటు వెయ్యలనని ప్రశ్నించారు.అబద్ధాలు చెప్పటం మోసం చేయటం బారస నాయకుల నైజామని ఎద్దేవా చేశారు.ఎన్నికల్లో రోహిత్ రావు భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.పద్మా దేవేందర్ రెడ్డి అసత్య ఆరోపణలపై జిల్లా ఎస్పీ కి పిర్యాదు చేస్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.27 ఏండ్ల యువకుడు ఎన్నికల్లో పోటీ చేస్తే బీఆర్ ఎస్ నాయకులకు ఎందుకు భయమని ప్రశ్నించారు. ఏది ఏమైనా మెదక్ లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్,కౌన్సిలర్ అవారి శేఖర్,నాయకులు హఫిజ్ ఉద్దీన్, గూడూరి కృష్ణ, ఇస్మాయిల్, ఆంజనేయులు, భూపతి,ప్రవీణ్, దేవ్ లా నాయక్ తదితరులు ఉన్నారు.
.