కాంగ్రెస్ గెలిస్తే రైతులకు కరెంటు కష్టాలే

బీఆర్ఎస్ తోనే సిరిసిల్ల అభివృద్ధి

మీ బిడ్డగా ఆశీర్వదించి గెలిపించినందుకు రాష్ట్రంలో, దేశంలోనే గౌరవాన్ని పెంచిన

తంగళ్ళపల్లి రోడ్ షోలో మంత్రి కేటీఆర్

తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); కాంగ్రెస్ గెలిస్తే రైతులకు కరెంట్ కష్టాలూ తప్పవని మంత్రి కేటీఆర్ అన్నారు.బుధవారం  తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. మహిళలు బతుకమ్మలతో, బోనాలతో మంత్రి కేటీఆర్ కు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ని గెలిపిస్తే రైతులకు మళ్లీ మూడు గంటల కరెంటుతో కష్టాల పాలు కావడం ఖాయమని, కాంగ్రెస్ హయాంలో కరెంటు ఎలా ఉండేదో, ఇప్పుడు ఉన్న కరెంటు ఇలా ఉంటుందో చూడండి అని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎన్ని అవస్థలు పడ్డాము చూశారు కదా, కాబట్టి ఇవాళ మనకు ఏవైతే పోటీ ఉన్న పార్టీలు ఒక దిక్కు కాంగ్రెస్ మరో దిక్కు బిజెపి కి ఓటు వేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పార్టీకే ఓటు వేయాలని, ఈరోజు సిరిసిల్ల ఇంత అభివృద్ధి జరిగిందంటే కేవలం బీఆర్ఎస్ పార్టీతోనేనని, అంతేకాకుండా సిరిసిల్ల బ్రిడ్జి కింద 24 గంటలు నీళ్లు సముద్రం లాగా ఉన్నాయని, కాబట్టి మీరు నన్ను మళ్లీ గెలిపిస్తే సిరిసిల్ల నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్ వన్ జిల్లాగా చేస్తానని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

.