489 గ్యాస్ సిలిండర్స్ స్వాధీనం.
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న వివిధ రకాల చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు గాను, జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ రెండు స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసి, విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించడం జరుగుతుంది. ఈ దాడులలో భాగంగా.. సదాశివపేట మండలం సూరారం గ్రామంలో ధరణి వాటర్ ప్లాంట్ లో తులసి రాజేందర్, మన్నే సతీష్, రాజ్ సహాయంతో గ్యాస్ గోదాం నడుపుతూ అక్రమంగా గ్యాస్ రిఫిల్లింగ్ చేస్తున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించి గొ గ్యాస్ ఫుల్ 21kg గలవి-314, గొ గ్యాస్ ఖాళివి 21kg గలవి-60, గొ గ్యాస్ చిన్నవి 4kg గలవి-63, హెచ్.పి గ్యాస్ ఫుల్ 19kg గలవి-07, హెచ్.పి గ్యాస్ ఖాళివి 19kg గలవి-19, హెచ్.పి గ్యాస్ చిన్నవి 6kg గలవి-02, మొత్తం 465, రీఫిలింగ్ మోటర్స్-2, రీఫిలింగ్ పైప్స్-04, స్వాధీనపరుచుకొని, నిందితులను స్వాధీనపరుచుకున్న సొత్తుతో విచారణ కోసం సదాశివపేట పోలీసు స్టేషన్ కు తరలించారు.
అలాగే పటాన్ చెరువు పోలీసు స్టేషన్ పరిధిలో ఇస్నాపూర్ లోని ప్రముఖ్ నగర్ లో శివకుమార్ అనే వ్యక్తి తన షాప్ నందు అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నాడనే సమాచారం మేరకు దాడులు నిర్వహించి గొ గ్యాస్ ఫుల్ 18.5kg గలవి-03, గొ గ్యాస్ రన్నింగ్ 18.5kg గలది-01 హెచ్.పి గ్యాస్ ఖాళివి 16kg గలవి-02, చిన్నవి గ్యాస్ 3.5kg గలవి-09 మొత్తం 15, రీఫిలింగ్ పైప్స్-01, వేయింగ్ మిషన్-01 స్వాధీనపరుచుకొని, నిందితులను, స్వాధీనపరుచుకున్న సొత్తును విచారణ నిమిత్తం పటాన్ చెర్వు పోలీసు స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు.
సదాశివపేట పోలీసు స్టేషన్ పరిధిలో అబ్దుల్ సలీం అనే వ్యక్తి తన సైకిల్ రిపేర్ షాప్ నందు అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నాడానే సమాచారం మేరకు దాడులు నిర్వహించి కమర్షియల్ సిలిండర్ 18.1 కేజీ గలవి-01, కమర్షియల్ సిలిండర్ 17.6 కేజీ గలవి-01, డోమెస్టిక్ సిలిండర్ 15.9 కేజీ గలవి-02, డోమెస్టిక్ సిలిండర్ 15.8 కేజీ గలవి-01, కమర్షియల్ సిలిండర్ 14.6 కేజీ గలవి-01, చిన్న సిలిండర్స్-03, మొత్తం 09 , వేయింగ్ మిషన్-01, రీఫిలింగ్ మోటర్స్-01. స్వాధీనపరుచుకొని, నిందితులను, స్వాధీనపరుచుకున్న సొత్తును విచారణ నిమిత్తం సదాశివపేట పోలీసు స్టేషన్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
.