అక్రమ గంజాయి సాగుపై ఉక్కు పాదం.

స్పెషల్ టాస్క్ఫోర్స్ టీమ్స్ దాడులు..  

12 కిలోల గంజాయి మొక్కలు స్వాధీనం

సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న వివిధ రకాల చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు గాను, జిల్లా ఎస్పీ రూపేష్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసి, విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించడం జరుగుతుంది. ఈ దాడులలో భాగంగా  హద్నూర పోలీసు స్టేషన్ పరిధిలో గల డప్పూరు గ్రామంలో ఫక్రుద్దీన్ అనే వ్యక్తి తన వ్యవసాయ పొలంలోని చెరుకు తోట మధ్యలో మిశ్రమ పంట వేస్తూ  అక్రమ గంజాయిని సాగు చేస్తున్నాడని సమాచారం మేరకు అతని వ్యవసాయ పొలంపై దాడి నిర్వహించి 12 కిలోల బరువు గల 3-గంజాయి మొక్కలను స్వాధీనపరుచుకొని, యజమానితో విచారణ నిమిత్తం హద్నూర పోలీసు స్టేషన్ కు  తరలించారు. 

ఈ సందర్భంగా ఎస్పీ రూపేష్  మాట్లాడుతూ.. ప్రభుత్వంచే నిషేదించబడిన గంజాయిని రైతులు ఎవరైనా అక్రమ సాగు, నిలువ, రవాణా చేసిన చట్టరీత్య కఠిన చర్యలుంటాయని, అట్టి వ్యవసాయ భూమిని సీజ్ చేసి తహశీల్దార్ కు అప్పగించడం జరుగుతుందన్నారు. రిపీటెడ్ గా పై చర్యలకు పాల్పడితే సంభందిత వ్యక్తులపై పి.డి. ఆక్ట్ నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

.