ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా కెసిఆర్ ను గెలిపించండి : బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి

బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా కెసిఆర్ ను గెలిపించుకోవాలని ఎల్లారెడ్డిపేట బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ఓటర్ల కు విజ్ఞప్తి చేశారు,

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూం కెసిఆర్ నగర్ కాలనీలో   బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ నేవూరి మమతా వెంకట్ రెడ్డి,  ఎల్లారెడ్డిపేట 11 వ వార్డు లో సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి లు ఇంటి ఇంటికి తిరిగి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు,

ఈ సందర్భంగా బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి మాట్లాడుతూ   తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులను సంక్షేమ   పథకాలను చూసి  కారు గుర్తు కు ఓట్లు వేసి కేటీఆర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు,

ఇళ్ళు లేని  పేద ప్రజల కు  డబుల్ బెడ్ రూం  ఇళ్ళు ఇచ్చిన కెసిఆర్ ను  కెటిఆర్ ను  రానున్న ఎన్నికల్లో మద్దత్తుగా నిలువాలని ఆయన కోరారు, 

కారు గుర్తు కు ఓట్లు వేసి కేటీఆర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని వారు ఓటర్ల ను కోరారు అందుకు సంబంధించిన కరపత్రాలను ఓటర్ల కు పంచి పెట్టారు, 

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు , మహిళలు తదితరులు పాల్గొన్నారు

.