బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలను చూసే పార్టీలో చేరాను
మాజీ మావోయిస్టు నేరెళ్ల జ్యోతి
నేరెల్ల జ్యోతికి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న చల్మెడ లక్ష్మి నరసింహారావు
తెలంగాణ ప్రభ,(కోనరావుపేట); కోనరావుపేట మండలం శివంగలపల్లి గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ జిల్లా కమిటీ మాజీ సభ్యురాలు నేరెళ్ల జ్యోతి అలియాస్ జ్యోతక్క శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహరావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆమెతోపాటు ధర్మారం గ్రామ సర్పంచ్ గున్నాల అరుణ సైతం గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా చల్మెడ, జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ లు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.... రాష్ట్రంలో అన్నీ పార్టీలతో పోలిస్తే తెలంగాణ ఉద్యమ పార్టీగా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే పార్టీగా బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు పొందిందన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలంటే అది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలను చూసి పార్టీలో చేరానన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సుమారు 19 ఏళ్లపాటు మావోయిస్టు పార్టీలో జిల్లా కమిటీ సభ్యురాలిగా, తెలంగాణ ప్రెస్ ఇన్చార్జిగా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించిన జ్యోతి ఇటీవలే పార్టీని వీడి లొంగిపోయిన విషయం తెలిసిందే.
.