కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); ప్రజలంతా కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇంచార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తంగళ్ళపల్లి మండలం సారంపల్లి లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన గ్రామ ఉప సర్పంచ్ గుండి పరశరాములు,వార్డు మెంబర్ G. పరశరాములు, మండల గౌడ సంఘం ఉపాధ్యక్షులు కోల గంగారం గౌడ్, గౌడ్స్ యూత్ అధ్యక్షులు గుగ్గిళ్ళ రామ్ గౌడ్ ఇతర నేతలు 80 మంది, రామచంద్రాపూర్ గ్రామం నుండి 20 మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం లేకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీలో ఇంతమంది కార్యకర్తలు చేరారని, కాంగ్రెస్ తోనే ప్రజా సంక్షేమమని, పార్టీ హయాంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు జరిగాయి అన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. పదవి ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నానని ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ నాయకులు, మండల కమిటీ నాయకులు, మహిళా కమిటీ నాయకులు, యూత్ నాయకులు, గ్రామ శాఖ నాయకులు పాల్గొన్నారు.
