తెలంగాణ ప్రభ, (పెద్దపల్లి): స్థానిక 11వ డివిజన్లో కృష్ణ నగర్, భగత్ సింగ్ నగర్, 5 ఇంక్లైన్ ఏరియా, ప్రజలకు గత కొన్ని రోజులుగా మున్సిపల్ నీటి సరఫరా ప్రెషర్ లేకపోవడంతో ప్రజలకు నీరు సరిపోక ఇబ్బంది పడుతున్నారు, ఈ సమస్యకు పరిష్కారం కోసం
కార్పొరేటర్, పెద్దల్లి తేజస్విప్రకాష్, పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లి మేయర్ & కమిషనర్ గారి సహకారంతో 5 లక్షల జనరల్ ఫండ్ నిధులను మంజూరు చేపించి కృష్ణా నగర్ నుండి 5 ఇంక్లైన్ ఏరియా వరకు 250 HD లైన్ నుండి 150, Di లైన్ కు ఇంటర్ కనెక్షన్స్ కలపడం & వాల్స్ పెట్టించడం ద్వారా ప్రజల నీటి సమస్య పరిష్కారమవుతుంది అని తెలియజేశారు,
ఈ కార్యక్రమంలో డివిజన్ పెద్ద మనుషులు, గుడికందుల రవి కాశిట్టి శివ, డీలర్ తిరుపతి, బొమ్మ ప్రభాకర్ గౌడ్, శ్రీహరి గౌడ్, దాసరి కొమురమ్మ, బొమ్మ రాజేశం, బండ విజయ, ములుకుంట్ల మౌనిక, పాదం రాజమౌళి, శకుంతల, పొన్నం విజయ, భాగ్య తదితరులు పాల్గొన్నారు
.