మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు

తెలంగాణ ప్రభ, (పెద్దపల్లి): స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా  ఆగస్ట్  26 న రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె సి ఆర్ ఆదేశించిన నేపధ్యంలో రామగుండం నగరంలో కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. . ఆర్ ఎఫ్ సి ఎల్ టౌన్ షిప్ లోని  ఆనంద కేంద్రం పరిసరాల్లో ఉన్న ఖాళీ స్థలంలో  ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జరుగుతున్న ఏర్పాట్లను రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ సి హెచ్ . నాగేశ్వర్ , డిప్యూటీ కమిషనర్ త్రయoబకేశ్వర్ రావు శనివారం  పర్యవేక్షించారు .  దాదాపు వెయ్యికి  పైగా ఎత్తైన మొక్కలను అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా ఈ ప్రాంతంలో నాటేందుకు రామగుండం నగర పాలక సంస్థ ఆద్వర్యంలో ఏర్పాట్లు చేసినట్లు  రామగుండం నగర పాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుచరణ్ , ఎ  ఇ  తేజస్విని ,  హరిత హారం  ఇంచార్జ్ అధికారి అర్జున్ వివరించారు.

.