తెలంగాణ ప్రభ ,(సిరిసిల్ల): రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సిరిసిల్లకు చెందిన రెడ్డి మల్ల హనుమయ్య ఎన్నికయ్యారు. ఇటీవల హైదరాబాద్ తుక్కుగూడలో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బత్తుల రమేష్ బాబు, కార్యదర్శిగా రెడ్డి మల్ల హనుమండ్లు, ముఖ్య సలహాదారుగా బల్లి శ్రీనివాస్, ఎండి సాదిక్ పాషా, పి లక్ష్మీనారాయణ, కోశాధికారిగా కిరణ్ కుమార్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా ఎస్ చంద్రశేఖర్, భానుచందర్ గౌడ్, ఏకగ్రీవంగా నియామకం మయ్యారు. రేషన్ డీలర్ల కమిషన్ పెంపు తో పాటు సమస్యలపై ఉద్యమిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి మల్ల హనుమాండ్లు తెలిపారు.
