మతం కన్నా సేవ మిన్న : డాక్టర్ ఏం ఏ.హకీమ్.

అఖండ శివనామ సప్తాహ కార్యక్రమానికి 10 వేలు  విరాళం అందజేత.

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి గ్రామంలోని కొత్తపల్లికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన్న  పోచారం కాలనీలో  గల శ్రీ అభయ బస్వేశ్వర ఆలయంలో కొనసాగుతున్న అఖండ శివనామ సప్తాహ కార్యక్రమానికి డాక్టర్ ఎంఎ హకీమ్ రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు.లోక కళ్యాణార్థం ఈ నెల 24న  ప్రారంభమైన ప్రథమ అఖండ శివనామ సప్తాహా కార్యక్రమం సోమవారానికి 3వ రోజుకు చేరింది. కార్యక్రమం నిర్వహణకు తనవంతుగా రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు.  విరాళం అందజేసినందుకు ఆలయ కమిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నగరం రాములు సెట్,  ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆర్. సుదీప్ కుమార్,  కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

.