తెలంగాణ ప్రభ (కోటగిరి): ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త భారత్ బంద్ కు పిలుపు మేరకు నసురుల్లాబాద్ మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో బంద్ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ బంద్ కు వ్యాపార సంస్థలు,విద్య సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు తెలియజేశారు. శాంతి యుతంగా ర్యాలీ, ధర్నా నిర్వహించి పలు నినాదాలు చేశారు. కలిసుంటే ముద్దరా వర్గీకరణ వొద్దూరా అనే నినాదాలతో హోరెత్తించారు. ఇరువైపులా వందలాది వాహనాలు నిలిపివేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు బాల సాయిలు ఉప అధ్యక్షులు గైని పోశెట్టి,శ్రీనివాస్.ప్రధాన కార్యదర్శి నిరడి లక్ష్మణ్ సోషల్ మీడియా శ్రీనివాస్, సలహాదారులు. నర్సింలు. సంగయ్య.సాయికుమార్ మహేష్ మండల నాయకులు మామిడి భూమయ్య ఉల్లెంగ కిరణ్ కుమార్ దుర్కీ శ్రావణ్ బొమ్మేన్ దేవ్ పల్లి లింగమయ్య.సంగెం సాయిలు. మీర్జాపూర్ బాలరాజు .హజీపూర్ సంజీవ్ వివిధ గ్రామాల నుండి. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వారసులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
.