కలెక్టర్ కు ఏబీవీపీ నాయకులు వినతి.
తెలంగాణ ప్రభ (సిరిసిల్ల) తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి రాఖీ కట్టకుండా విద్యార్థుల పట్ల కర్కశంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ తక్షణం సస్పెండ్ చేయాలి కోరుతూ కలెక్టర్ కు ఇచ్చిన వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు. పిల్లల పట్ల దురుసుగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ ను తక్షణం సస్పెండ్ చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో శావనపల్లి ప్రశాంత్, నితిన్, ధనుష్, వెంకటేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
