నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.

ప్రజావాణికి 131 దరఖాస్తులు.

సిరిసిల్ల,(తెలంగాణ ప్రభ): నిర్ణీత గడువులోగా ఫిర్యాదు ద్వారా సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 131 దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.  కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏ. వో, సూపరింటెండెంట్లు, వివిధ మండలాల రెవెన్యూ, పంచాయతీ రాజ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

.