నిబంధనల ప్రకారం విద్యుత్ మీటర్ల రీడింగ్ తీయాలి : బియ్యం కార్ శ్రీనివాస్, పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు

సిరిసిల్ల. (తెలంగాణ ప్రభ): ఎలక్ట్రిసిటీ బోర్డు నిబంధనల ప్రకారం విద్యుత్ మీటర్ల రీడింగ్ సక్రమంగా తీయాలని అధికారులను కోరినట్లు సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు బియ్యం కార్ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ 28 రోజులు విద్యుత్ వాడుకున్న31వ రోజున రీడింగ్ తీయడం వల్ల వినియోగదారులు నష్టపోతున్నారని అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. ఓకే మీటర్ పై రెండు లక్షల బిల్లు విషయంలో ఫిర్యాదు చేయగా సెస్ అధికారుల వాదన బోర్డు తోసిపుచ్చినట్లు తెలిపారు. పలు అంశాల విషయంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అధికారులను కలిసిన వారిలో జోగినిపల్లి సంపత్ రావు, కుసుమ గణేష్ తదితరులు ఉన్నారు.

.