కోరుట్ల పట్టణంలో స్వచ్ఛ దనం--పచ్చదనం కార్యక్రమం

తెలంగాణ ప్రభ (కోరుట్ల):  రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జువ్వాడి నర్సింగరావు  సూచనల మేరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్  బట్టు తిరుపతి ఆధ్వర్యంలో వార్డ్ కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీనారాయణ 3వ వార్డు సాయిరాం పుర కాలనీలో ఇంటింటా జర సర్వే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ బి తిరుపతి మరియు వార్డ్ కౌన్సిలర్ మోర్తాడు లక్ష్మీనారాయణ నీరు నిల్వ ఉన్న కూలర్లలో నీరును తీసివేసి శుభ్రపరచడం జరిగింది. 

ఇట్టి కార్యక్రమం సందర్భంగా కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీనారాయణ వార్డు ప్రజలకు వ్యాధులకు  సంబంధించిన తగు సూచనలు తెలియజేస్తూ, ఇంటి లోపల కూలర్లలో పూలకుండిలలో  టైర్లలో మరియు ఇతర నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో దోమల తయారై వాటినుండి  పలు రకాల అంటువ్యాధులు, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ఇట్టి నీరు నిల్వ ప్రాంతాలను శుభ్రపరచుకోవాలని తెలుపుతూ,ఇళ్లలో నుండి వెలుపడే చెత్తను బయట గాని మురికి కాలువలో గాని పడేయకుండా చెత్తను తడి పొడిగా వేరు చేసి మునిసిపల్ ఆటోకు ఇచ్చి మన ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని వారు తెలిపారు. 

వీధులలో వీధి కుక్కలు చాలా స్వైర విహారం చేస్తూ ప్రజలను చిన్నపిల్లలను గాయాలపాలు చేయడమే కాకుండా చిన్న పిల్లల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. కాబట్టి ప్రజలు అలాగే చిన్న పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉంటూ పిల్లలను బయట తిరగకుండా చూసుకోవాలని తెలిపారు.

అలాగే ప్రతి ఒక్కరూ చెట్లను నాటి వాటిని సంరక్షించి కాలుష్య నివారణకు చేదోడు వాదోడుగా నిలవాలని కోరారు.

ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ చిట్యాల శ్రీనివాస్, మున్సిపల్ ఇంజనీర్ అలాగే వార్డు అధికారులు నరేందర్, అంగన్వాడి టీచర్లు మాధవి, శోభారాణి, ఆర్ పి పుష్ప ఆశ వర్కర్ శారద మున్సిపల్ సిబ్బంది వార్డు ప్రజలు పాల్గొన్నారు.

.