విద్యార్థులు శాస్త్రీయ విధానాలు అలవర్చుకోవాలి

వర్ణం వెంకటరెడ్డి, రైతు సంఘం నాయకులు. 

సిరిసిల్ల. (తెలంగాణ ప్రభ) విద్యార్థులు శాస్త్రీయ విధానాలు అలవర్చుకోవాలని రైతు సంఘం నాయకులు వర్ణం వెంకటరెడ్డి అన్నారు. గురువారం సిరిసిల్లలోఎస్ఎఫ్ఐ జిల్లాస్థాయి విద్య వైజ్ఞానిక శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణ తరగతులు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ అధ్యక్షతన జరిగాయి. శాస్త్రీయ ఆలోచన గతి తార్కిక భౌతిక వాదం అనే అంశంపై విద్యార్థులకు రైతు సంఘం నాయకులు వర్ణం వెంకటరెడ్డి బోధించారు. సమస్యలన్నింటికీ శాస్త్రీయ పరిష్కారం ఉంటుందని సమాజానికి ఉపయోగపడేలా విద్యార్థులు ఆలోచన విధానాన్ని అలవర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్, యుటిఎఫ్ జిల్లా నాయకులు పాకాల శంకర్ గౌడ్, జన విజ్ఞాన వేదిక నాయకులు రామరాజు, ఎరవల్లి నాగరాజు, హలో నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.

.