మందకృష్ణ మాదిగ 30% రిజర్వేషన్ కల్పించు, ఎస్సీ వర్గీకరణ కాదు.

మాల మహానాడు ఆధ్వర్యంలో 

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు మండల అధ్యక్షుడు మిర్జాపూర్ సాయన్న ఆధ్వర్యంలో ఉమ్మడి మండలాల మాల మహానాడు నాయకులు సుప్రీం కోర్ట్ ఎస్సీ వర్గీకరణకు తీర్పు ఇచ్చినందుకు వ్యతిరేకంగా మాల మహానాడు నాయకులు రస్తారోకో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా రాస్తారోకో కార్యక్రమం సందర్భంగా సాయన్న మాట్లాడుతూ.. మాలలు మాదిగలు కలిసి మెలిసి ఉండడంతో బిజెపి కేంద్ర ప్రభుత్వం సహించుకోలేక మాల మాదిగలను విడదీసి వర్గీకరణ తీర్పు ఇచ్చినందుకు మాలలందరం ఖండిస్తున్నామని అన్నారు.కులాలను  విడదీసి పరిపాలించి కులాల మధ్య చిచ్చు పెట్టడానికి వర్గీకరణ చేయడం జరిగిందని మండిపడ్డారు. ఇంతటితో ఈ ఉద్యమాన్ని ఆపకుండా డివిజన్ స్థాయిలో జిల్లా స్థాయిలో ధర్నాలు  నిర్వహించడం జరుగుతుందని తెలిపారు .మోడీ డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు ఉమ్మడి మండలాల ఉపాధ్యక్షులు ఖాలే సాయిలు, పుప్పల సైదయ్య, అంబేద్కర్ సంఘ అధ్యక్షులు బ్యాగరి రాములు పాల గంగారం, జంగం సాయిలు, కొత్తపల్లి పుప్పల మారుతి, సతీష్ కుమార్,గంగారాం,సైదయ్య, కొల్లూరు దిగంబర్ రమేష్, కోడిచర్ల  మాజీ సర్పంచ్ ఈరువంతరావు పవన్ సాయి, సాయిబాబా, నాగార్జున కారేగాం రామచందర్,ఎత్తోండ తుకారం, పోతంగల్ అధ్యక్షులు వీరేందర్ పలు గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

.