రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది - కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ప్రెస్ మీట్

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ కల్లూరు రోడ్డులో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కానీ అది ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టు వ్యవహరిస్తుందన్నారు ఆరోగ్య విషయంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. 

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంద బలంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన రైతుబంధు రైతు భరోసా ఊసే లేదన్నారు ఇక అవి గోవిందా అన్నారు 

రైతు రుణమాఫీ విషయంలో 31 వేల కోట్లు ఉన్నాయని, ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పడమే కానీ, ఇప్పటివరకు అమలు చేసిన దాఖలు లేవని, 50 వేల రుణమాఫీలో కేవలం 40 నుండి 50 శాతం మందికి మాత్రమే రుణమాఫీ అయిందని, మిగతా 40 నుండి 50 శాతం మందికి రుణమాఫీ జరగలేదన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ప్రజాప్రతినిధులను కూడా చూడకుండా పోలీసు వ్యాన్లలో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. 

కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రోజుకో మర్డర్ మానభంగం రైతు ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయన్నారు. 

గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ఇలాంటివి ఎక్కడ జరగలేదని మహిళా ఎమ్మెల్యేలను కూడా చూడకుండా ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా మాట్లాడడం బాధాకరమన్నారు. తెలంగాణ సాధనకు ఎన్నోసార్లు రాజీనామాలు చేసిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని అలాంటి పార్టీలో ఉన్న పదవులు ముఖ్యం కాదని ప్రజా శ్రేయస్సు ముఖ్యమన్నారు. 

ప్రజా ప్రతినిధులను కూడా చూడకుండా ప్రతిపక్ష నేతలను దూషించే విధానాన్ని ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసినా సరే ఊరుకునేది లేదని, మహిళలు ప్రజల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబ్జెక్టుపై మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టలేదన్నారు. కేసీఆర్ కిట్టు కూడా లేదని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సరుకు లేదు సబ్జెక్టు లేదు అనే విధంగా ఉందన్నారు పని చేతగాని నాయకులే తిట్ల పురాణం చేస్తారని నిజమైన ప్రజాప్రతినిధులు పనిచేసి చూపిస్తారన్నారు. 

ఈ ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు తగ్గాయన్నారు. 

ఇకపోతే త్వరలోనే కోరుట్ల పట్టణంలో నూతనంగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రి పూర్తిస్థాయిలో వినియోగం లోకి రానుందని, ఇట్టి ఆసుపత్రిలో ఐదు డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 

ఇక ప్రజలు ఎవ్వరు కూడా పట్టణ ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేదన్నారు. 

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తిట్లు, అబద్ధాలతోనే కాలం వెలదీస్తుందన్నారు. 

ఈ సమావేశంలో భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి నారాయణరెడ్డి, భారత రాష్ట్ర సమితి పార్టీ కోరుట్ల మండల అధ్యక్షులు దారిశెట్టి రాజేష్, పిఎసిఎస్ చైర్మన్ సింగిరెడ్డి నర్సారెడ్డి, నాయకులు అంజయ్య, మోహన్ రెడ్డి, కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఫహీమ్, బట్టు సునీల్, మొలుమూరి రాజ మురళి, అతిక్, చిత్తారి ఆనంద్, భారత రాష్ట్ర సమితి పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

.