పెద్ద సారు... మీ సేవలు మరువలేనివి : బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .

న్యూఢిల్లీలో "ఆచార్య జయశంకర్" జయంతిని పురస్కరించుకొని ఆచార్య జయశంకర్ సార్ గారి చిత్రపటానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి పూలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కె.పి.వివేకానంద .

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) న్యూఢిల్లీలో "ఆచార్య జయశంకర్" జయంతిని పురస్కరించుకొని జయశంకర్ సార్ చిత్రపటానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి ఎమ్మెల్యే కె.పి వివేకానంద్  పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను చాటి చెప్పిన మహోన్నత ఉద్యమ శిఖరం... తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్  అని, వారి స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్గదర్శకత్వంలో బంగారు తెలంగాణగా మార్చామన్నారు. సూర్యచంద్రులు ఉన్నంతవరకు  ఆచార్య జయశంకర్ ని వారి సిద్ధాంతాలను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరువలేరన్నారు.


ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

.