జిందం కళ చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్.
సిరిసిల్ల. (తెలంగాణ ప్రభ): ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన త్యాగాలు స్ఫూర్తిదాయకమని సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రా పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం తెలంగాణ ఏర్పాటు కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన త్యాగాలు స్ఫూర్తిదాయమని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, పలువురు కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు.
.