కోరుట్ల పట్టణంలో ఘనంగా స్నేహితుల దినోత్స వేడుకలు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల వాసవి మాత దేవాలయంలో ఆదివారం రోజు వాసవి క్లబ్, సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవ కార్యక్రమంను ఘనముగా నిర్వహించారు. అలాగే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సేవా సమితి (ప్రథమ వాడకట్టు సంఘం) ఆద్వర్యంలో ఘనంగా స్నేహితుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్బంగా ఫ్రెండ్ షిప్ ట్యాగ్ ను ఒకరికొకరు కట్టుకొని కేక్ కట్ చేసి స్నేహానికి వున్న విలువను చాటారు. 

అనంతరo పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు మోటూరి రాజుని సన్మానించడం జరిగింది. 

ఈ సందర్బంగా వాసవి క్లబ్ అధ్యక్షుడు నేతి శ్రీకాంత్ మాట్లాడుతూ అన్ని బంధాల కంటే స్నేహబంధం ఎంతో విలువైందన్నారు. మంచి స్నేహితుడు ప్రతి వ్యక్తికి ఒకరు ఉన్న ఎంతో భరోసా ఉంటుందని, తమ కష్టాలను పంచుకునే స్నేహితుడు ఉన్నప్పుడు మనలో ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. స్నేహితుడు ఇచ్చిన ధైర్యంతో ఉన్నత శిఖరాలకు ఎదిగిన వారు ఎందరో ఉన్నారన్నారు. స్నేహంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చిన సర్దుకుపోవాలన్నారు. 

ఈ కార్యక్రమములో వాసవి క్లబ్ అధ్యక్షులు నేతి శ్రీకాంత్, కార్యదర్శి రేగొండ మహేష్, కోశాధికారి యెల్లంకి శివ, సీనియర్ సిటిజన్ అధ్యక్షులు నీలి శ్రీనివాస్, కార్యదర్శి కొత్త విద్యాసాగర్ కోశాధికారి శక్కరి వెంకటేశ్వర్లు, ఎలిమిల్ల మనోజ్, ముక్క చిన్న ధర్మరాజు, మానుక ప్రసాద్, పొద్దుటూరి జలందర్, కొత్త సునీల్, రేగొండ శిరీష్, అల్లాడి మహేష్, గుడిసె కోటేశ్వర్ క్లబ్ ల సంఘ సభ్యులందరూ పాల్గొన్నారు.

.