జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిసిన కొండగట్టు ఆలయ ఈ.ఓ. రామకృష్ణ

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ను కలెక్టర్ ఛాంబర్ లో కొండగట్టు ఆలయ ఈ.ఓ. రామకృష్ణ మర్యాద పూర్వకంగా కలిసి స్వామి వారి ప్రసాదాన్ని అందజేసారు. 

అనంతరం కొండగట్టు ఆలయ అర్చకులు కలెక్టర్ ను ఆశీర్వదించారు. సాధారణ బదిలీల్లో భాగంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం నూతన ఈ.ఓ గా నియామకమైన ఎల్. రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు.

.