అప్పుడు మహిళలు గుర్తుకు రాలేదా..

కాముని వనిత. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు. 

సిరిసిల్ల. (తెలంగాణ ప్రభ) మహిళల గురించి మాట్లాడుతున్న బి ఆర్ ఎస్ నాయకుల తీరుపై మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళల గురించి మాట్లాడుతున్న టిఆర్ఎస్ నాయకులకు కేటీఆర్ సొంత నియోజకవర్గంలో ని ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ సంఘటన జరిగినప్పుడు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. సిరిసిల్ల రాజీవ్ నగర్ లో కూడా జరిగినప్పుడు స్పందించని బిఆర్ఎస్ నాయకులు మహిళల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. విమర్శలు చేసే ముందు ఆలోచించాలని కోరారు. సమావేశం   కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్. పిసిసి మెంబర్ నాగుల సత్యనారాయణ గౌడ్. ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు. జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వైద్య శివప్రసాద్ . పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిమ్యాన  ప్రసాద్.పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వెలుముల స్వరూప. జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి కల్లూరి చందన. నాయకులు మాజీ పిసిసి కార్యదర్శి గడ్డం నర్సయ్య. ఎల్లె లక్ష్మీనారాయణ. కాసర్ల రాజు గొల్లపల్లి పరుశరాములు తదితరులు పాల్గొన్నారు

.