మందకృష్ణ పోరాటానికి అంతిమ విజయం
మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు చెట్టుపల్లి లక్ష్మణ్ మాదిగ
తెలంగాణ ప్రభ (కోరుట్ల): ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షనీయమని స్వాగతిస్తున్నామని మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు చెట్టుపల్లి లక్ష్మణ్ మాదిగ అన్నారు.
శుక్రవారం కోరుట్ల పట్టణంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో 30, సంవత్సరాలుగా మాదిగ, మాదిగ ఉప కులాల ప్రజలు న్యాయమైన ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి కోసం ఎన్నో ఉద్యమాలు నిరాహార దీక్షలు, జైలు, మహాసభలు, ధర్నాలు రాస్తారోకోలు పోరాటాలు చేశామని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ ఏ బి సి డి చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని ఏడుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మసనం తీర్పు ఇచ్చిందని ఆయన తెలిపారు.
ఈ యొక్క వర్గీకరణను రానున్న ఉద్యోగ నోటిఫికేషన్ లలో అమలుపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
సుప్రీంకోర్టు మెజారిటీ బెంచి అసమానతలు ఉన్న సమాజంలో ఉప వర్గీకరణ సాధ్యమైనవి దానికి రాష్ట్రాలు చేసుకోవచ్చని ఇచ్చిన తీర్పు భారత దేశ చరిత్రలో చారిత్రాత్మకమైనదనిగా ఎమ్మార్పీఎస్ ఎం జె ఎఫ్ అభిమానిస్తుందని ఆయన అన్నారు.
భారత రాజ్యాంగం పేద వర్గాలకు అమలు జరగడం రెండో దశ ప్రారంభమైందని తెలియజేశారు.
75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో భారత రాజ్యాంగం ఫలాలు కొందరికే పరిమితమయ్యాయని, సుప్రీం కోర్టు తీర్పు ద్వారా అంతిమ వర్గాలకు ఆ ఫలాలు అందనున్నయన్నారు. మందకృష్ణ మాదిగ సుదీర్ఘ పోరాటం అంతిమ ఫలితాన్ని ఇచ్చిందని, తద్వారా మాదిగ, మాదిగ ఉపకులాలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ, రంగాలలో సముచిత స్థానం లభిస్తుందని ఆశ భావం వ్యక్తం చేశారు. భారతదేశంలో సుదీర్ఘంగా కొనసాగుతున్న ఉద్యమం అంతిమ ఫలితాన్ని ఇచ్చిందని, దీన్ని ఇచ్చిన మాట ప్రకారం భుజాన వేసుకొని సుప్రీంకోర్టుకు సహకరించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాకు జిల్లా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఎస్సీ వర్గీకరణ కోసం జరిగిన పోరాటంలో అమరులైన అమరవీరుల త్యాగాలు వెలకట్టలేమని అన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు మాదిగ, మాదిగ ఉపకులాల విజయం అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుప్రీం తీర్పును అనుసరించి వర్గీకరణ ఫలాలు అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ లో ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
.