ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

తెలంగాణ ప్రభ (కోరుట్ల): ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘ నాయకులు అన్నారు. 

శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దశాబ్దాల కాలం నుండి ఎదురుచూస్తున్న, వర్గీకరణను సుప్రీంకోర్టు ఆమోదిస్తూ రాష్ట్రాలకు అధికారాలిస్తూ తీర్పునివ్వడం శుభ సూచకమన్నారు. 

సుప్రీం కోర్టులో వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడం ఎన్నో ఏళ్ల నుండి వెనుకబడ్డ ఎస్సీ ఎస్టీ కులాలతో పాటు ఉపకులాలకు ఈ వర్గీకరణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 

పార్లమెంటులో ఈ వర్గీకరణ ఆమోదించాలని వారు కోరారు. 

దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సక్రమంగా జరగాలని అన్నారు. 

ఈ వర్గీకరణ రాజకీయ ,ఉద్యోగ, ఉపాధి రంగాలతో పాటు ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో కూడా అమలు అయ్యే విధంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు చూడాలన్నారు. 

ఒక తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా వర్గీకరణ చట్టాన్ని ఉభయసభలలో పకడ్బందీగా అమలు అయ్యేలా చూడాలన్నారు. రాజకీయ స్వార్థాల కోసం ఎస్సీ ఎస్టీలను మళ్లీ వెనుకబాటు తనం వైపు నెట్టాలని చూస్తే రానున్న రోజుల్లో ఆయా పార్టీలకు తగిన గుణపాఠం చెపుతామని వారు హెచ్చరించారు. 

ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు ఉయ్యాల నరసయ్య, బలిజ రాజారెడ్డి, బద్ది మురళి, ఉయ్యాల శోభన్, పసుల కృష్ణ ప్రసాద్, సామల వేణుగోపాల్,  బోలె గంగాధర్, పురుషోత్తం తదితరులు ఉన్నారు.

.