ఎస్సీ, ఎస్టీల వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాము - ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్_

తెలంగాణ ప్రభ (కోరుట్ల): ఎస్సీ వర్గీకరణ కావాలని గత ముప్పై సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యమానికి ఊపిరినిస్తు ఎస్సీ, ఎస్టీల వర్గీకరణ అవసరమంటు సుప్రీం కోర్టు ఇచ్చిన సంచలనాత్మక తీర్పును తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ, అంబేద్కర్ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ స్వాగతించారు.

గురువారం కోరుట్లలోని తన కార్యాలయంలో పేట భాస్కర్ విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అంశాలను కేంద్ర ప్రభుత్వ పరిధినుండి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి తేవడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం తీర్పును స్వాగతీస్తు వెంటనే తెలంగాణలో విద్యా, ఉద్యోగ రంగాల్లో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అమలు చేస్తామనడం శుభ సూచకమన్నారు. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పోరాటం, ఆమరుల త్యాగాలు వృధా పోలేవని వర్గీకరణ వల్ల ఎస్సీ, ఎస్టీ ఉప కులాలు అభివృద్ధి లోకి వస్తారని పేట భాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

.