నిధులు కేటాయించకపోవడంపై ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి.

తెలంగాణ ప్రభ ( సిరిసిల్ల):  కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఓ బి సి మో ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ముట్టడించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి బిసి డిక్లరేషన్, బీసీలకు బడ్జెట్లో ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. అధికారులకు ఇచ్చిన వినతి పత్రాలు సమస్యలను వివరించారు. కార్యక్రమంలో ఓ బి సి జిల్లా అధ్యక్షులు వెంకటేష్, ఎర్ర మహేష్ అల్లాడి రమేష్, రేగుల మల్లికార్జున్, రవీందర్ ,దాసరి శ్రీనివాస్, గుండెల్ని వేణుగోపాల్, శ్రీనివాసరావు, బూర విష్ణు, సురువు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

.