అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి

బిఆర్ఎస్ యువ నాయకులు జైహింద్  

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) జగద్గిరిగుట్ట డివిజన్ మద్దుమ్ నగర్ లో శ్రీ ఎల్లమ్మ పోచమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా భక్తులు అమ్మవారికి సమర్పించిన ఒడిబియ్యాన్ని మంగళవారం బొడ్రాయి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బొడ్రాయి కమిటీ సభ్యులు మాట్లాడుతూ అమ్మవారికి సమర్పించిన ఒడిబియ్యాన్ని భక్తులకు ప్రసాదంగా అన్నదానం  చేయడం సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులు బస్తి ప్రజలందరిపై ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో అమ్మవారి ఆశీస్సులు ఉండేలా చూడాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు జైహింద్, సత్యనారాయణ, నరేందర్, విటల్ గౌడ్, లక్ష్మణ్, రాజేష్, వినోద్, విగ్నేష్, శీను, మహమూద్, బాబురావు, గుల్టన్, శంకర్, జైపాల్ రెడ్డి , రాజు, విటల్, మైలారం రాజు, నరసింహారెడ్డి, విటల్ మనోజ్, ప్రభు, తదితరులు పాల్గొన్నారు.

.