తెలంగాణ ప్రభ (కోరుట్ల): ఆశాఢ మాస సందర్బంగా కోరుట్ల పట్టణ బ్రాహ్మణ మహిళా సంఘ సభ్యులు గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళా సంఘ సభ్యులు ముందుగా సౌభాగ్యానికి అధిష్టాన దేవత అయిన గౌరీ మాతను అలంకరించి పూజించిన తర్వాత ఒకరికొకరు గోరింటాకును పెట్టుకున్నారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ మాసం లో మహిళలు గోరింటాకును పెట్టుకోవడంలో ఒక శాస్త్రియ కోణం ఉందని, దీనిని పెట్టు కోవడం వల్ల శరీరం లో వేడి తగ్గి చలువ చేస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమం లో పాలేపు స్వప్న, బ్రహ్మన్న గారి శివ రాణి, పద్మజ, శరణ్య, లావణ్య, పూర్ణిమ,జ్యోతి, కరుణ మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.
.