కోరుట్లలో ఉచిత ఫైబ్రోస్కాన్ శిబిరం

తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల పట్టణంలో ఈరోజు లయన్స్ క్లబ్ కోరుట్ల ఆధ్వర్యంలో మనోవరీ హాస్పిటల్ లో ఉచిత ఫైబ్రోస్కాన్ శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ నటరాజు మాట్లాడుతూ కాలేయముకు సంబంధించిన జాగ్రత్తలు వివరించడం జరిగింది. ప్రజలందరూ కాలేయమునకు సంబంధించి తగు జాగ్రత్తగా తీసుకోవాలని, సమయానికి డాక్టర్లను సంప్రదించాలని ఆయన అన్నారు. 

ఈ కార్యక్రమంలో 90 మంది ప్రజలకు లివర్ స్కానింగ్ చేయడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అధినేత లయన్ డాక్టర్ ముక్క ఇంద్రనీల్,గీత ఇంద్రనీల్ మరియు లయన్స్ క్లబ్ కోరుట్ల అధ్యక్షులు కుందారపు మహేందర్, కార్యదర్శి శ్రీ గద్దె నరేంద్ర, కోశాధికారి జగపతి రెడ్డి పాల్గొనడం జరిగింది.

.