విద్యార్థులను పరామర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

తెలంగాణ ప్రభ (కోరుట్ల) మూడు రోజుల క్రితం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఫకీర్ కొండాపూర్ గ్రామానికి చెందిన ఆడేపు గణేష్ మరియు మెట్ పల్లి పట్టణానికి చెందిన రాపర్తి హర్షవర్ధన్ అనే విద్యార్థులను పరామర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్.

డాక్టర్స్ తో మాట్లాడి విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని ఆయన కోరారు.

అసెంబ్లీ సమావేశాలు ఉండటం వలన నియోజకవర్గంలో లేనని అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే పాఠశాలను సందర్శించి భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని ఆయన తెలిపారు.

.