కల్పతరువు ఫౌండేషన్.
తెలంగాణ ప్రభ (కోటగిరి): నిజమాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని కొత్తపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో , నిజమాబాద్ జిల్లా దాతల సహకారంతో హైద్రాబాద్ కు చెందిన కల్పతరువు ఫౌండేషన్ ఫౌండర్ వారు డాక్టర్ భానుశిరీష శేషు కుమార్ దంపతులు ఒకటి నుంచి 8వ. తరగతి పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు స్కూల్ బ్యాగులతో పాటు అంగన్వాడీ పిల్లలకు స్టేషనరీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతిరోజు ఒకరికి సహాయం చేయాలనీ(హెల్ప్ వన్ పర్సన్ ఎవరీ డే), వాళ్ళకు జీవితంలో ఉపయోగపడేటువంటి విషయాలను ,తల్లిదండ్రులకు ప్రకృతిని కాపాడాలనే ఉద్దేశ్యంతో వంటశాలలో ఉపయోగించే కూరగాయల వేస్టేజ్ తో వచ్చే (బయోఎంజ్రిమ్)తయారీ విధానం పై క్లుప్తంగా వివరించారు.
పాఠశాల ఉపాధ్యాయులు డాక్టర్. భాను శిరీష శేషు కుమార్ తో పాటు ఆమె స్నేహితులైన యోగ ట్రైనర్ సాయికి శాల్వలతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషన్ ఉపాధ్యాయులు విజయ్,సుధాకర్,శ్రీనివాస్, ఘన్సీరాణి, మాజీ వార్డ్ మెంబర్ రవికుమార్, విద్యా వాలంటీర్లు సంధ్యా స్వరూప శోభ అంగన్వాడి టీచర్ సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
.