ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించే బడ్జెట్.
ఎన్. బాల్ రాజ్
పిడి.ఎస్.యూ. జిల్లా అధ్యక్షులు..
కోటగిరి మండల కేంద్రంలోని పాత్రికేయుల సమావేశంలో ఈ కార్యక్రమం
ఈ సందర్బంగా పిడి.ఎస్.యూ. జిల్లా అధ్యక్షులు ఎన్. బాల్ రాజ్ మాట్లాడుతూ....
తెలంగాణ ప్రభ (కోటగిరి): తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక రాష్ట్ర బడ్జెట్లో అట్టహాసంగా 2.91,259 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. ఈ మొత్తం ఆర్థిక బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 21,292 కోట్లు మాత్రమే కేటాయించడం సిగ్గుచేటు. ఈ విద్యారంగానికి కేటాయించిన మొత్తం వార్షిక బడ్జెట్ తో పోలిస్తే కేవలం విద్యా రంగానికి 7.31% శాతం మాత్రమే. ఇది విద్యాభివృద్ధికి ఏమాత్రం సరిపోదు. మరోపక్క 8000 కోట్ల పైచిలుకు పెండింగ్స్ స్కాలర్షిప్లు ఫీజు రిమార్మెంట్లు ఉన్నాయి. వాటిపై ఏమాత్రం ప్రకటన చేయలేదు. తెలంగాణలోని మొత్తం యూనివర్సిటీలకు కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఈ బడ్జెట్ ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా ఉన్నది. విద్యారంగం పట్ల రేవంత్ రెడ్డి సర్కారుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అనిపిస్తుంది. ఎన్నికల సందర్భంగా విద్యార్థులకు నిరుద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. బడ్జెట్ కేటాయింపులలో వాటిని పూర్తిగా విస్మరించింది. గత పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వం లో కూడా విద్యారంగానికి ఇదే విధమైన కేటాయింపులు జరిగాయన్నారు. దానివల్ల గత పది సంవత్సరాలు పూర్తిగా విద్యారంగం బ్రష్టు పట్టిపోయింది. ఇప్పుడు పాలకులు మారిన విద్యారంగానికి అదేవిధంగా కేటాయింపులు జరగడం దొందు దొందే అనిపించుకుంటున్నాయి. మరోపక్క గత గురుకులాలకు భిన్నంగా అన్ని కులాలు ఒకే దగ్గర చదువుకోవడానికి పైలెట్ ప్రాజెక్టులుగా కొడంగల్ మధిర నియోజకవర్గం లలో ప్రత్యేక గురుకులాలు స్థాపిస్తున్నామని ప్రకటించాయి. వాటికి కూడా ఎక్కడ బడ్జెట్ కేటాయింపులు చేయలేదు. గత గురుకులాల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి వాటి అభివృద్ధిపై ఎక్కడ స్పష్టమైన ప్రకటనలు చేయలేదు. ఇప్పటికే పూర్తిగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ ధ్వంసం అయినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ పాఠశాలలకు,కళాశాలలకు,సంక్షేమ హాస్టల్ కు పక్కా భవనాలు లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది.విద్యార్థులకు
అనుగుణంగా సదుపాయాలు లేక సమస్యల వలయంలో కూనరిల్లుతున్నాయి. వాటి అభివృద్ధికి ఎక్కడా కూడా స్పష్టమైన ప్రణాళికలు ప్రకటించలేదు. మరోపక్క పాఠశాలలో, కళాశాలలో,విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి బోధన, బోధ నేతర ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించినటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా వాటిపై స్పష్టమైన హామీలు ఇవ్వలేదు. ఈ బడ్జెట్ కేటాయింపులు కేవలం విద్యా రంగంలోని ఉద్యోగస్తుల జీతభత్యాలకు, విద్యాలయాల మెయింటెనెన్స్ కు మాత్రమే సరిపోతాయి. ఇది విద్యాభివృద్ధికి ఏ మాత్రం సరిపోవు. విద్య రంగానికి ఈ విధంగా కేటాయింపులు చేయడం ద్వారా ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్టే ఉంది. ఇది ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు పరోక్షంగా ఉపకారం చేస్తుంది. ఇది వారికి అనుకూలమైన బడ్జెట్. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సరిచేసి కొఠారి కమిషన్ సూచించిన విధంగా రాష్ట్ర ఆర్థిక బడ్జెట్లో 30% శాతం నిధులను కేటాయించి విద్యాభివృద్ధికి తోడ్పడాలని, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని కోరుతున్నాము. లేని పక్షంలో PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థి లోకాన్ని సమాయత్తం చేసి ఉద్యమాలు నిర్వహిస్తామని, ఆందోళనలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము.ఈ కార్యక్రమంలో పిడి. ఎస్.యూ. జిల్లా నాయకులు సాయి కుమార్, నాగరాజ్ లు పాల్గొన్నారు.........
.